మొత్తం విశ్వం నిజంగా నేనే. స్వయం తప్ప మరొకటి లేదు. జ్ఞానోదయం పొందిన వ్యక్తి, మట్టి పాత్రలు మరియు కుండలను మట్టిగా తప్ప మరేమీగా భావించనట్లే, ప్రపంచంలోని ప్రతిదాన్ని తన స్వరూపంగా చూస్తాడు.
The enlightened person sees everything in the world as his own Self, just as one views earthenware jars and pots as nothing but clay.
- ఆది శంకరాచార్యులు
Residential Vedanta Course is designed for individuals who wish to explore Advaita Vedanta, a deep spiritual and philosophical tradition. This six-month programme offers a unique opportunity for students to immerse themselves in the teachings of Advaita Vedanta. During this period, students live a disciplined and focused life in an Ashram environment, where they attend regular classes and take part in various activities that encourage deep reflection and learning. This residential experience supports a structured and meaningf
ఈ గురుకుల వేదాంత తరగతులు అనేది ఆధ్యాత్మిక మరియు తాత్త్వికంగా లోతైన అద్వైత వేదాంతమును అధ్యయనం చేయదలచినవారికోసం రూపొందించబడినది. ఈ ఆరునెలల శిక్షణ ద్వారా విద్యార్థులు వేదాంత బోధనల్లో సంపూర్ణంగా నిమగ్నమయ్యే అపూర్వ అవకాశం పొందతారు. ఈ సమయంలో, విద్యార్థులు ఆశ్రమంలో క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అనుసరిస్తూ తరగతులకు హాజరై వివిధ ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఈ గురుకులనివాస అనుభవం జీవితానికి ఒక దిశను ఇవ్వడమే కాకుండా, అద్వైత వేదాంతంలోని గంభీరతను హృదయపూర్వకంగా గ్రహించడానికి మార్గాన్ని కల్పిస్తుంది.
Our Purohit Course is a cherished opportunity for individuals to connect with the divine through the timeless practices of Vedic rituals and ceremonies. Rooted in tradition and guided by experienced mentors, this course unveils the intricate art of performing sacred rites. Participants will learn the sacred chants, the precise rituals, and the deep symbolism that accompanies these age-old traditions. Whether you seek to become a Purohit yourself or wish to forge a deeper connection with the divine practices, this course will be a life-enriching journey.
పురోహిత శిక్షణ అనేది భగవంతుడితో అనుబంధాన్ని ఏర్పరచుకునే ఒక విలువైన అవకాశం. ఇది ప్రాచీనకాలమునుండి వచ్చే శాశ్వతమైన సంప్రదాయ పూజా విధానాల ద్వారా ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. సంప్రదాయాలకు వేరుబడని విధంగా, అనుభవజ్ఞులైన గురువుల మార్గదర్శనంలో ఈ శిక్షణ పవిత్ర కర్మకాండల నైపుణ్యాన్ని వివరంగా బోధిస్తుంది.
ఈ శిక్షణలో పాల్గొనేవారు పవిత్ర మంత్రోచ్ఛారణ, క్రియావిధులు, మరియు ఈ ఆధ్యాత్మిక సంప్రదాయాల వెనక దాగిన లోతైన తాత్త్విక భావాలను నేర్చుకుంటారు. మీరు ఒక పురోహితుడిగా మారాలని ఆశపడుతున్నా, లేక ఈ దివ్యాచారాలకు మరింత దగ్గరగా చేరాలన్న ఆలోచనతో ఉన్నా, ఈ శిక్షణ మీ జీవితానికి ఒక గొప్ప మలుపు ఇస్తుంది.