" కల్పితమైన ‘పాము’ అనే అజ్ఞానపు భ్రమ తొలగితే గానీ దానికి ఆధారమైనది తాడు అనే జ్ఞానం ఎలా కలుగదో, అటులనే ‘ప్రపంచం నిజం’ అనే విశ్వాసం తొలగనంతవరకు దానికి ఆధారమైన ఆత్మ సాక్షాత్కరించదు
(Just as the illusion of ignorance regarding the fictional 'snake' is dispelled when one recognizes the underlying reality as the rope, the realization of the true self will not occur until the belief in the 'world's truth' is similarly removed. )
"
― Adi Shankaracarya
Welcome to Sri Shankara Chinmayam Ashram – a sacred haven for spiritual seekers and sincere aspirants wishing to deepen their understanding of Sanatana Dharma and ancient wisdom. Nestled in serene surroundings, our ashram is a place of peace, learning, and transformation.
శ్రీ శంకర చిన్మయం ఆశ్రమం — ఇది ఆధ్యాత్మిక మార్గాన్ని అన్వేషిస్తున్న వారికి, మరియు సనాతన ధార్మిక జ్ఞానాన్ని లోతుగా తెలుసుకోవాలనుకుంటున్న తపస్వుల కోసం ఏర్పాటైన పవిత్ర స్థలం. ప్రకృతి వడిలో నిశ్శబ్దం మరియు పవిత్రత నిండిన ఈ ఆశ్రమం జ్ఞానాన్ని, సాధనను, ఆత్మపరిశుద్ధిని అందించే క్షేత్రంగా నిలుస్తుంది.
🌿 Come, be a part of our Ashram and begin a beautiful inner journey. The sacred rituals taught in the Purohit Course and the timeless wisdom shared in the Vedanta Course will gently guide you towards self-understanding and spiritual growth.
🌿 పవిత్ర ఆశ్రమంలో చేరి, ఒక అద్భుతమైన అంతర్గత యాత్రను ప్రారంభించండి. పురోహిత తరగతులులో బోధించే ఆచారాలు, వేదాంత తరగతులులో తెలియజేసే శాశ్వత జ్ఞానం కలిసి, మీకు ఆత్మజ్ఞానానికి, ఆధ్యాత్మిక అభివృద్ధికి చక్కగా దారి చూపుతాయి.
This six-month residential Vedanta course is a valuable opportunity for those who wish to study Vedanta deeply. Students live in a traditional ashram environment, follow a disciplined routine, attend regular classes, engage in self-study, and participate in spiritual and service activities. The course provides not just knowledge, but a chance to live the teachings of Vedanta in daily life.
వేదాంతాన్ని లోతుగా అధ్యయనం చేయదలచినవారికి, ఈ ఆరు నెలల గురుకుల వేదాంత తరగతులు ఒక అమూల్యమైన అవకాశాలుగా నిలుస్తాయి. విద్యార్థులు సాంప్రదాయ ఆశ్రమ వాతావరణంలో నివసిస్తూ, నియమిత నిబంధనలతో తరగతులు, స్వాధ్యాయం, ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ కోర్సు వేదాంతాన్ని కేవలం గ్రహించడానికి మాత్రమే కాక, రోజువారీ జీవితం ద్వారా ఆచరించడానికి కూడా మార్గం చూపుతుంది.
🌼 Advaita Vedanta Course
Journey into the realm of deep wisdom and self-discovery with our Advaita Vedanta Course. This course explores the non-dual philosophy of Advaita Vedanta — the vision that all of existence is one undivided reality.
Led by an experienced teacher, students will study the nature of the Self, consciousness, and the ultimate truth that connects all beings. Through traditional scriptures, meaningful discussions, and guided reflection, participants will walk the path of inner growth and clarity.
This six-month residential course follows the time-tested Gurukula system, focusing on the core texts of Advaita Vedanta — the Prasthana-trayi (Upanishads, Bhagavad Gita, and Brahmasutras).
🔸Age: 18 to 60 years
🔸Minimum Qualification: 10th class pass
🔸Course Duration: Six-months
🔸Application Deadline: 20-10-2025
🔸Course Begins: 25-10-2025
🌼 అద్వైత వేదాంత తరగతులు
ఆత్మజ్ఞానమూ, పరమార్ధం పట్ల లోతైన అవగాహన కలిగించే ఈ అద్వైత వేదాంత తరగతులు ద్వారా మీరు జీవితం యొక్క అసలైన సత్యాన్ని తెలుసుకునే యాత్ర ప్రారంభించవచ్చు.
అనుభవజ్ఞులైన గురువుల మార్గదర్శనంలో, ఈ తరగతులు ద్వారా విద్యార్థులు – సాక్షాత్కారమును, చైతన్య స్వరూపాన్ని, మరియు సర్వ జగత్తుకి ఆధారంగా ఉన్న పరమ సత్యాన్ని తెలుసుకుంటారు. వేదాంత గ్రంథాల అధ్యయనంతో పాటు, శ్రద్ధతో కూడిన చర్చలు, ధ్యానం ద్వారా అంతరాత్మను తెలుసుకునే మార్గాన్ని అనుసరిస్తారు.
ఆరు నెలల పాటు ఉండే ఈ గురుకుల శిక్షణ విధానంలో బోధించబడే ఈ తరగతులలో ప్రస్థానత్రయి అయిన ఉపనిషత్తులు, భగవద్గీత మరియు బ్రహ్మసూత్రాలు ప్రధాన గ్రంథాలుగా ఉంటాయి.
🔸 వయస్సు: 18 నుంచి 60 సంవత్సరాలు
🔸 అర్హత: కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులు
🔸 కాలవ్యవధి: ఆరు నెలలు
🔸 దరఖాస్తు చివరి తేది: 20-10-2025
🔸 తరగతులు ప్రారంభ తేది: 25-10-2025
Time table in Vedanta Course
(శిక్షణా కాలంలో సమయానుసరణి)
5:30 to 6:00 am: Mantra Chanting (మంత్రాలు నేర్చుకోవడం)
7:00 to 8:00 am: 1st Vedanta class ( మెదటి వేదాంత తరగతి)
8:00 am: Breakfast (అల్పాహారం)
10:30 to 11:15 am: Pooja (పూజ)
11:30 to 12:30 pm: Sanskrit & Stotram class (సంస్కృతం & స్తోత్రాలు నేర్చుకోవడం)
12:30 pm: Lunch (భోజనం)
4:00 to 5:00 pm: 2nd Vedanta class (రెండవ వేదాంత తరగతి)
6:40pm: Arathi (హారతి)
7:00 to 8:00 pm: Bhajans & Satsang (భజనలు &సత్సంగము)
8:00 pm: Dinner (రాత్రి భోజనం)
How do I apply?
Follow these steps:
Option 1: Download, print, and fill out the Application Form. Include your recent photograph and necessary documents, and send everything via Speed Post or registered post to the address mentioned on the form.
Option 2: Download, print, and fill out the Application Form. After completing the form, scan or take a photo of it. Include your recent photograph and necessary documents. Finally, email the scanned or photographed PDF form, along with the supporting documents and your recent photograph, to srishankarachinmayam@gmail.com
నేను ఎలా దరఖాస్తు చేయాలి?
ఎంపిక/ఆప్షన్ 1: దరఖాస్తు ఫారమ్‌ను డౌన్లోడ్ చేయండి, ప్రింట్ చేయండి మరియు పూరించండి. మీ ఇటీవలి ఫోటో మరియు అవసరమైన పత్రాలను చేర్చండి మరియు ఫారమ్‌లో పేర్కొన్న చిరునామాకు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా అన్నింటినీ పంపండి.
ఎంపిక/ఆప్షన్ 2: దరఖాస్తు ఫారమ్‌ను డౌన్లోడ్ చేయండి, ప్రింట్ చేయండి మరియు పూరించండి. ఫారమ్‌ను పూర్తి చేసిన తర్వాత, దాన్ని స్కాన్ చేయండి లేదా ఫోటో తీయండి. మీ ఇటీవలి ఫోటో మరియు అవసరమైన పత్రాలను చేర్చండి. చివరగా, స్కాన్ చేసిన లేదా ఫోటో తీసిన PDF ఫారమ్‌తో పాటు సహాయక పత్రాలు మరియు మీ ఇటీవలి ఫోటోతో పాటు srishankarachinmayam@gmail.com కి ఇమెయిల్ చేయండి